కలం డెస్క్: క్రీడారంగంలో భారత్ తన మార్క్ చూపిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రపంచ కప్‌లను సాధిస్తోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండ్ ప్రపంచకప్‌లు చేరాయి. రోల్ బాల్ వరల్డ్ కప్‌లో (Roll Ball World Cup) భారత పురుషుల, మహిళల జట్లు ఘన విజయం సాధించాయి. ఈ టోర్నీ దుబాయ్(Dubai) వేదికగా జరిగింది. ఇందులో పురుషుల జట్టు 11-10 తేడాతో, మహిళల జట్టు 3-2 తేడాతో విజయం సాధించాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కెన్యా.. భారత పురుషుల జట్టుకు గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో భారత్ వెనుకంజలో నిలిచినప్పటికీ, ఆపై పుంజుకుని ఈ విజయాన్ని కైవసం చేసుకుంది.
ఇది భారత పురుషుల జట్టుకు ఐదో ప్రపంచకప్ టైటిల్ కాగా, మహిళల జట్టుకు మూడో ప్రపంచకప్ టైటిల్‌గా నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్, కెన్యా, పోలాండ్, అర్జెంటీనా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ వంటి దేశాలు పాల్గొన్నాయి. 2023లో పుణేలో జరిగిన ప్రపంచకప్‌లో కెన్యా చేతిలో భారత్ ఓడిపోయింది. కాగా దానికి ఈ ఏడాది ప్రతీకారం తీర్చుకుందనే చెప్పాలి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో (Roll Ball World Cup) భారత్ రెండు విభాగాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది.
Read Also: 40 కోట్లకు చేరువలో 5జీ వినియోగదారులు!
Follow Us On: X(Twitter)


