కలం, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీ టూర్ లో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీలో హైవేలు, ఇతర రోడ్ల నిర్మాణం కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అమరావతిని నేషనల్ హైవేలతో కనెక్ట్ చేస్తూ డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని రిక్వెస్ట్ చేశారు. 6 లేన్ల కేబుల్ స్టెడ్ బ్రిడ్జ్ అమరావతికి ఎంతో అవసరం అని చంద్రబాబు నాయుడు (Chandrababu) చెప్పారు. ఈ బ్రిడ్జ్ మూలపాడు వద్ద 3 కీలకమైన నేషనల్ హైవేలతో అమరావతిని కనెక్ట్ చేస్తందని చెప్పారు. దీనిపై వీలైనంత త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు.


