కలం, వెబ్ డెస్క్ : బాలికతో బలవంతంగా పెళ్లి, అత్యాచారం కేసులో భర్త, తండ్రికి జీవిత ఖైదు పడింది. హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన ఓ బాలికకు.. ఆమె తండ్రి బలవంతంగా 2018లో ఓ వ్యక్తితో పెళ్లి చేశాడు. ఆ పెళ్లి(Minor Marriage)పై కేసు నమోదైంది. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా.. నేడు రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలిక తండ్రి, ఆమె భర్తకు జీవిత ఖైదు విధించింది. బాలికకు రూ.15 లక్షలు పరిహారం కింద ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ రోజుల్లోనూ మైనర్ అమ్మాయిలకు పెళ్లిళ్లు జరుగుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి కోర్టు తీర్పులు ఎన్ని వస్తున్నా ఇలాంటి పెళ్లిళ్లు తగ్గట్లేదు. మరి ఈ తీర్పులో తండ్రికి కూడా శిక్ష వేసినందున మైనర్ పెళ్లిళ్లు (Minor Marriage) ఏమైనా తగ్గుతాయా లేదా చూడాలి.
Read Also: అనూష హత్యోదంతం… అసలు రాష్ట్రంలో డౌరీ మరణాలెన్నో తెలుసా?
Follow Us On: Instagram


