epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అండర్​–19 ఆసియా కప్​ ఫైనల్​కు భారత్​​​, పాక్​

కలం, వెబ్​డెస్క్​:  యువ భారత్​ అదరగొట్టింది. అండర్​–19 వన్డే ఆసియా కప్​లో ఫైనల్ (India VS Pakistan) ​కు చేరింది. శుక్రవారం దుబాయ్​ వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్​లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది తుదిపోరుకు చేరింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్​లో టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. చమిక హేనతిగల(42; 38 బంతుల్లో 3 ఫోర్లు) ఆ జట్టులో టాప్​ స్కోరర్​. విమత్​ దిన్సార(32; 29 బంతుల్లో 4 ఫోర్లు), సెత్మిక సెనెవిరత్నె(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్​) ఓ మోస్తరు పరుగులు చేశారు.

అనంతరం 139 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన యువ భారత్​ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి జయకేతనం ఎగరవేసింది. ఓపెనర్లు ఆయుష్​ మాత్రే(7), వైభవ్​ సూర్యవంశీ(9) త్వరగానే వెనుదిరిగినా అరోన్​ జార్జ్​(58 నాటౌట్​; 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​), విహాన్​ మల్హోత్రా (61 నౌటౌట్​; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్​) అజేయ అర్ధసెంచరీలతో జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత్​ కోల్పోయిన రెండు వికెట్లూ రసిత్​ నింసరా ఖాతాలో చేరాయి. శుక్రవారమే జరిగిన మరో సెమీస్​లో పాక్​ జట్టు 8 వికెట్ల తేడాతో బంగ్లా యువజట్టుపై గెలిచింది. బంగ్లాదేశ్​ 26.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్​ కాగా, లక్ష్యాన్ని పాక్​ 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్ (India VS Pakistan)​ ఆదివారం జరుగుతుంది.

Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>