సీఎంగా కాదు.. ప్రజా సేవకుడిగా ఉంటా : సీఎం విజయ్

కలం, వెబ్ డెస్క్ : ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజా సేవకుడిగా ఉంటానని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) అన్నారు. తమిళనాడులో లంచం అనేది లేకుండా చేయడమే తన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఒక్కరోజులో ఏదీ జరగదు.. అది మ్యాజిక్‌ కాదని తెలుసన్నారు. కానీ, ఏదో ఒకరోజు లంచం అనేది లేకుండా చేస్తానని సీఎం విజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలను తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టించడానికి లేదా మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజల పక్షాన నిలబడి పని చేయడానికి వచ్చానని విజయ్ (CM Vijay) తెలిపారు. ఆరు నెలల తరువాత విమర్శిస్తామన్న డీఎంకే.. ఆరు రోజులు గడవకముందే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందని విజయ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినడానికి కారణం డీఎంకే పార్టీ అని ఆయన ఆరోపించారు.

Read Also: ఆసియా గేమ్స్ రేసులో భారత్: టాప్స్ గ్రూప్‌లోకి 22 మంది రోవర్లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>