రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటన షురూ

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు (సోమవారం) కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం రెబ్బన మండలం కాగజ్ నగర్ క్రాస్ రోడ్డు దగ్గర నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు.

సీఎం జిల్లాల పర్యటనలో భాగంగా జూన్ 1 నుంచి 4 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా తొలుత రేపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొమురం భీం అసిఫాబాద్ లో పర్యటించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 3న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం కోహెడలో 239 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కు శంకుస్థాపన చేయనున్నారు. 4వ తేదీన మహబూబ్ నగర్ లోని జూరాల ఎత్తిపోతల పథకం పరిశీలన ఉండనుంది. కాగా, సీఎం జిల్లాల టూర్ షెడ్యూల్ లో పలు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: విజ‌య‌వాడ‌లో పెద్ది ప్రీ రిలీజ్‌.. ఏర్పాట్ల‌లో ఎంపీ చిన్ని బిజీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>