కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా పరిధిలో గల బద్రీనాథ్ జాతీయ రహదారి (NH-7) (Badrinath Highway) పై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జోషీమఠ్ సమీపంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. ఈ భారీ జామ్ ను నియంత్రించడానికి స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అత్యవసరంగా టోకెన్ ఆధారిత ‘గేట్ సిస్టమ్’ విధానాన్ని అమలుల్లోకి తెచ్చారు. దీని ద్వారా ప్రతి 30 నిమిషాల వ్యవధితో వాహనాలను ఒకవైపు మాత్రమే అనుమతిస్తూ వన్‌వే ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Read Also: ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు.. వీహెచ్ నిరసన
Follow Us On : WhatsApp

