కలం, వెబ్ డెస్క్: చలికాలంలో చాలామంది సాధారణంగా ఒంటికి వేడి చేసే ఆహార పదార్థాలు తీసుకుంటారు. వేడి సూప్స్, గరం గరం చాయ్ తాగడానికి ఇష్టం చూపుతుంటారు. కొందరైతే చలికి చెక్ పెట్టేందుకు ఆల్కహాల్(Alcohol) తీసుకుంటారు. చలికాలంలో మద్యం తీసుకోవడంపై అనేక అపొహలున్నాయి. శరీర వెచ్చదనం కోసమే తరుచుగా తీసుకునేవారు ఉన్నారు. మెతాదు మించి ఆల్కహాల్ తీసుకోవడం అనేది మంచిది కాదంటున్నారు డాక్టర్లు.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రజారోగ్య సలహాదారుల ప్రకారం.. చల్లని వాతావరణంలో మద్యం తీసుకోవడం ప్రమాదకరం. ప్రతి సంవత్సరం చలికాలంలో మద్యం (Alcohol) సేవించవద్దని ప్రజలను హెచ్చరిస్తూ IMD సూచనలు జారీ చేస్తున్నా మార్పు కనిపించడం లేదు. ఆల్కహాల్ రక్త నాళాలను విడదీస్తుంది. ఇది వేగంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. తక్కవ మోతాదు మద్యం గుండెకు మంచిదనే భావన చాలామందిలో ఉంది. కానీ ఇది కూడా హానికరమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మద్యపానం వల్ల నోటి, కాలేయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మద్యం తీసుకోవడం కంటే సరైన దుస్తులు, సమతుల్య పోషకాహారం, విశ్రాంతి ద్వారా చలి నుంచి కాపాడుకోవచ్చునని హెల్త్ నిపుణులు చెబుతున్నారు.
Read Also: వెంకటేష్ అయ్యర్ భారీ డిస్కౌంట్లో దక్కాడు: ఏబీ డివిలియర్స్
Follow Us On: Pinterest


