కలం వెబ్ డెస్క్ : అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ మూవీ 110 కోట్లకు పైగా కలెక్ట్ చేసి చైతూ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే అక్కినేని హీరోల్లో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ హీరోగా చైతూ రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో చైతూ నెక్ట్స్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం కార్తీక్ దండు(Karthik Dandu) డైరెక్షన్ లో చైతూ వృషకర్మ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చైతన్య చేసే సినిమా ఏంటనేది ఆసక్తిగా మారింది.
అప్పట్లో చైతన్య శివ నిర్వాణ(Shiva Nirvana)తో సినిమా చేయనున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఈమధ్య కాలంలో కొరటాల శివ కూడా చైతన్య కోసం ఓ కథ రెడీ చేశారని, స్టోరీ లైన్ విని చైతూ ఓకే చెప్పారని ఇండస్ట్రీలో వినిపించింది. కానీ దానిపైనా ఎలాంటి అప్ డేట్ లేదు. కొరటాల శివ(Koratala Shiva) ఎన్టీఆర్(NTR)తో దేవర2 చేయాల్సి ఉంది. కానీ, దేవర సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో సీక్వెల్ చేయాలా? వద్దా? అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ గ్యాప్‌లో కొరటాల శివ చైతూతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక చైతూ(Naga Chaitanya) నెక్ట్స్ సినిమా డైరెక్టర్లు వీళ్లే అంటూ లోకేష్ కనకరాజ్, గౌతమ్ తిన్ననూరి పేర్లు కూడా వినిపించాయి. వీరితో పాటు మరికొందరూ స్టార్ డైరెక్టర్ల కథలు కూడా విన్నాడట చైతూ. కానీ ఒక్క అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వలేదు. చైతూ ప్రస్తుతం చేసున్న వృషకర్మను వచ్చే సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇది చైతూ 24వ సినిమా. నెక్ట్స్ చేయబోయేది 25వ సినిమా కాబట్టి కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లే కథతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. దాని కోసం ఎలాంటి కథ ఎంచుకుంటాడో.. ఎవరి డైరెక్షన్‌లో సినిమా చేస్తాడో తెలియాలంటే చైతూ ఫ్యాన్స్ కొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే!
Read Also: సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడిన పాకిస్తానీ నటి, మై హార్ట్ అంటూ..
Follow Us On: Youtube


