ఢిల్లీలో నేడు ‘పెద్ది’ గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్

కలం, సినిమా : ‘పెద్ది'(Peddi) సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. నేడు (మే 28) రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న ‘పెద్ది’ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 1 గంట నుంచి జరగనున్న ఈ ఈవెంట్‌ను చిత్రబృందం గ్రాండ్‌గా ప్లాన్ చేసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్  అందిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలలో  కనిపించనున్నారు.

‘పెద్ది’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్  సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో అభిమానులు #GetReadyForPeddi అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>