ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌

కలం, వెబ్ డెస్క్: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రజా నాయకుడు నందమూరి తారకరామారావు జయంతి (NTR Jayanti) సందర్భంగా ఆ మహనీయుడికి జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు ఉదయాన్నే చేరుకొని పుష్పగుచ్చాన్ని సమర్పించి అంజలి ఘటించి నమస్కరించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్దకు భారీగా తరలివచ్చిన అభిమానులు ‘జోహార్ ఎన్టీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఏటా తాత జయంతి, వర్ధంతులకు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించడం తారక్ ఆనవాయితీగా వస్తోంది. ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుంటుండడంతో పోలీస్ అధికారులు భద్రతను పెంచారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు 103వ జయంతి నేడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>