ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

కలం, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్‌ (AP Liquor Scam)లో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ మేరకు ఏపీ సీఐడీ నుంచి కేసు వివరాలను తీసుకున్న ఈడీ అధికారులు వరుసగా విచారణలు చేస్తున్నారు.

విచారణకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, కుమారుడు

ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య, ఆయన కుమారుడు మంగళవారం విచారణాధికారుల ముందు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య పేరు మీద పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కీలక వివరాలను ఈడీ అధికారులు వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>