కలం, వెబ్ డెస్క్: జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కాకుండా, ఇండియాలోనూ ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ జేమ్స్ కామెరూన్‌ను ప్రశంసించగా, తాజాగా ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్(Sukumar) అదిరిపొయే రివ్యూ ఇచ్చారు.
సినిమా చూసిన అనంతరం సుకుమార్ (Sukumar) మాట్లాడారు. ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఒక అబ్సల్యూట్ బ్లాక్‌బస్టర్. గ్రాండ్ విజువల్స్ మాత్రమే కాదు.. కథలో బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి. ఎపిక్ కథను చెప్పడంలో జేమ్స్ కామెరూన్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్‌ను చూపించారు. ఇలాంటి మూవీని థియేటర్‌లో చూసినప్పుడే మంచి అనుభూతిని సొంతం చేసుకోగలం‘‘ అని సుకుమార్ అన్నారు. గతంలో జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అవతార్ (Avatar) సిరీస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. కామెరూన్ ఈ మూవీతో ఎలాంటి విజువల్స్ వండర్ అందిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: రవితేజకు సంక్రాంతి అయినా హిట్ ఇచ్చేనా?
Follow Us On : WhatsApp


