అమెరికాలోని వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం : సీక్రెట్ సర్వీస్ హై అలర్ట్

కలం, వెబ్‌ డెస్క్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ (White House) సమీపంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతా తనిఖీ కేంద్రం వద్దకు వచ్చిన ఒక అనుమానితుడు ఒక్కసారిగా సుమారు 15 నుండి 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. దీంతో అలర్ట్ అయిన సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే ఎదురుకాల్పులు జరిపి ఆ దుండగుడిని అక్కడికక్కడే కాల్చిచంపారు. ఈ భీకర కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్ హౌస్‌లోనే ఉన్నట్లు సమాచారం అందుతోంది. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారు.

ఈ పరిణామంతో వైట్ హౌస్ (White House) వెలుపల రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులను అధికారులు వెంటనే సురక్షితంగా బ్రీఫింగ్ రూంలోకి తరలించారు. ప్రస్తుతం వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. సీక్రెట్ సర్వీస్ బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: హీట్ వేవ్ ఎఫెక్ట్: ఆల్ టైమ్ హైకి విద్యుత్ వినియోగం!

Follow Us On: X (Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>