epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గూగుల్ జెమిని వాడొద్దంటున్న ఆ సంస్థ ఫౌండర్

కలం డెస్క్: గూగుల్ జెమిని(Googl Gemini) ఏఐకి రోజురోజుకు పాపులారిటీ పెరుగుతోంది. అందులో ఇచ్చే ఫీచర్స్, ఆన్సర్ ఇచ్చే స్పీడ్ ఇలా ఇంకేమైనా ఫీచర్స్ కారణాలుగా ఉన్నాయి. తాజాగా గూగుల్ జెమిని లైవ్(Gemini Live)ను కూడా లాంచ్ చేసింది. దానిని వినియోగించడానికి ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ తాజాగా దీనిపై గూగుల్ సహ వ్యవస్థాపుడు సెర్గే బ్రిన్(Sergey Brin) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జెమిని లైవ్‌ను ప్రస్తుతానికి ప్రజలు వాడకూడదని సూచించారు. ప్రస్తుతం అది పర్యవేక్షణలో ఉందని అన్నారు. ఇది చాలా పాత వెర్షన్ అని, అతి త్వరలో దీని సరికొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జెమిని లైవ్‌ను వినియోగించడం సురక్షితం కాదని అన్నారు. సాధారణంగా తాను డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు జెమిని లైవ్‌తో చాటింగ్ చేస్తానని, అలా చేయడం ద్వారా గూగుల్ ఏఐకి సమాచారం ఇస్తానని వెల్లడించారు. అయితే డ్రైవింగ్ చేసే సమయంలో జెమిని లైవ్‌ను ఎవరూ వినియోగించొద్దని అతను వెల్లడించారు. స్టాన్‌ఫోర్డ్ యూనిరవ్సిటీ ప్యానెల్‌లో ఇటీవల మాట్లాడుతూ సెర్గే బ్రిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘దీనిని ఇప్పుడు మీరు వినియోగించకండి. అతి త్వరలో చాలా బెటర్ వెర్షన్ రానుంది. ప్రస్తుతం ఉన్న వెర్షన్‌లో పెద్దగా మంచి ఫీచర్స్ లేవు’ అని అన్నారు. కానీ తాను ఇంటర్నల్‌గా వాడుతున్న వెర్షన్‌లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. కొన్ని వారాల్లోనే ఈ కొత్త వెర్షన్ విడుదల అవుతుందని చెప్పారు.

అసలు Gemini Live ఏం చేస్తుంది?

జెమిని లైవ్ అనేది గూగుల్ అసిస్టెంట్‌లా పని చేస్తుంది. ఇదొక ఆధునిక ఏఐ. కేవలం ప్రాంప్ట్ ఇస్తే కావాల్సిన సమాచారాన్ని చాలా సులభంగా వినియోగదారులకు అందిస్తుంది.

ఇందులో ఆధునిక స్పీచ్ టెక్నాలజీని వినియోగించారు. దాని వల్ల దీనితో మాట్లాడుతుంటే ఒక మనిషితో మాట్లాడిన ఫీల్ వస్తుంది.

దీనితో మాట్లాడే సమయంలో వినియోగదారుడు తాము మాట్లాడే వేగాన్ని స్లో చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారులు ఏ వేగంతో మాట్లాడినా దానిని జెమిని లైవ్ అనుసరించగలదు. అంతేకాకుండా అడిగిన ప్రశ్నలకు అంతే వేగంగా స్పష్టంగా సమాధానాలు ఇస్తుంది. ఇది సహజ సంభాషణకు చాలా దగ్గరగా ఉంటుంది.

జెమిని లైవ్‌తో వినియోగదారులు ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ కావొచ్చు. ఇది మాక్ ఇంటర్వ్యూలను నిర్వహించగలదు, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో ఏ స్కిల్స్‌ను హైలేట్ చేయాలి అన్న సూచనలను కూడా అందిస్తుంది.

Read Also: అమెరికాకంటే ఇండియా డబుల్.. AI వాడకంలో మనమే టాప్!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>