కలం వెబ్ డెస్క్ : Nidhhi Agerwal | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ మారుతి(Maruthi) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్(The Raja Saab). ఈ సినిమాపై మొదట్లో ఎలాంటి అంచనాలు లేకున్నా మూవీ టీం విడుదల చేస్తున్న పాటలు, ట్రైలర్ ఆడియెన్స్‌లో క్రేజ్ పెంచేస్తున్నాయి. 2026 సంక్రాంతికి విడుదల కానున్న రాజా సాబ్ మూవీ ప్రమోషన్ల కోసం టీం బాగానే కష్టపడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ మాల్‌లో రాజా సాబ్ మూవీలోని రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ వేడుకకు హీరోయిన్ నిధి అగర్వాల్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చింది. రాజాసాబ్‌లో ప్రభాస్ సరసన నటిస్తున్న ముద్దుగుమ్మల్లో నిధి ఒకరు. అయితే ఈ ఈవెంట్‌లో నిధిఅగర్వాల్‌కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. ఈవెంట్ ముగియగానే ఒక్కసారిగా నిధిని చుట్టుముట్టేశారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు, మాట్లాడేందుకు ఎగబడ్డారు. నిధి బాడీగార్డులు సైతం జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో నిధి తీవ్రంగా ఇబ్బంది పడింది.
ఆమె(Nidhhi Agerwal)ను కారు వరకు తీసుకెళ్లేందుకు బాడీ గార్డులు నానా తంటాలు పడ్డారు. జనాన్ని దాటుకుంటూ చివరకు నిధిని కారులో ఎక్కించారు. కారులో ఎక్కిన తర్వాత సైతం ఆ బ్యూటీ తీవ్ర అసహనానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతమంది వచ్చే ఈవెంట్‌కు మూవీ టీం హీరోయిన్‌కు సరైన సెక్యూరిటీ కల్పించకపోవడం ఏంటని, ఆ జనం అమ్మాయిని అలా ఇబ్బందులు పెట్టడం దారుణమని నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
Read Also: రవితేజకు సంక్రాంతి అయినా హిట్ ఇచ్చేనా?
Follow Us On : WhatsApp


