కలం వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ఒకప్పుడు వరుసగా హిట్లు కొట్టాడు. ఈమధ్య కాలంలో రవితేజకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతుంది. రాజాది ది గ్రేట్ సక్సెస్ తర్వాత టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. హమ్మయ్యా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు అనుకునే సరికి కిలాడు, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో స్పీడ్ పెంచాడు.
అయితే.. మళ్లీ మామూలే.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్, మాస్ జాతర సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల(Kishore Tirumala)తో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahashayulaku Vignapthi) అనే సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట విన్న వెంటనే నచ్చేసింది. సంక్రాంతి(Sankranthi)కి థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మాస్ హీరో రవితేజ(Ravi Teja), క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కలిసి చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
కిషోర్ తిరుమల.. నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, చిత్రలహరి, రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలను తెరకెక్కించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా 2022లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కిషోర్ తిరుమల నుంచి సినిమా రాలేదు. అందుకనే ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో ఈ మూవీకి వర్క్ చేస్తున్నాడట. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే.. యావరేజ్ టాక్ వచ్చినా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. మరి.. సంక్రాంతి అయినా రవితేజకు కలిసొస్తుందా..? ఆశించిన విజయాన్ని అందిస్తుందా..? అనేది చూడాలి.
Read Also: బన్నీ, అట్లీ మూవీ రెండు పార్టులుగా రానుందా..?
Follow Us On : WhatsApp


