కలం, వెబ్డెస్క్: విశాఖ ఉక్కు(రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) తాత్కాలిక సీఎండీగా మనీష్రాజ్ గుప్తా(Manish Raj Gupta) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. వచ్చే జనవరి 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్)లో డైరెక్టర్(టెక్నికల్, ప్రాజెక్ట్స్, రా మెటీరియల్స్)గా మనీష్రాజ్ పనిచేస్తున్నారు. దీనితోపాటు ఆయన విశాఖ ఉక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, విశాఖ ఉక్కుకు శాశ్వత సీఎండీ పోస్టు 2024, నవంబర్ 30 నుంచి ఖాళీగా ఉంది.
Read Also: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు !
Follow Us On: Youtube


