కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ యువకుడు ఐపీఎల్ కు ఎంపికయ్యాడు. సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన పేరాల అమన్ రావు (Aman Rao) ను రాజస్థాన్ రాయల్స్ రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. 21ఏళ్ల యువ బ్యాటర్ అయిన అమన్ రావు (Aman Rao) గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అండర్-19, అండర్-23 విభాగాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్ తో రెండు హాఫ్ సెంచరీలు చేసి ఐపీఎల్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అమన్ తండ్రి మధుసూదన్ రావు గతంలో జిల్లా స్థాయి క్రికెటర్. తండ్రి ప్రోత్సాహంతోనే అమన్ చిన్న తనం నుండి క్రికెట్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం అమన్ రావు కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది.
Read Also: మొదలైన టీ20 ప్రపంచకప్ టూర్.. రామసేతుపై అద్భుత దృశ్యం!
Follow Us On: Sharechat


