Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు దుర్మరణం

కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మంగళవారం రాత్రి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్ పై ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నక్రమంలో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. మృతులు దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామానికి చెందిన అల్లి సంపత్ (25), లింగమల్ల సతీశ్ (28), పుట్టాకర్ల వంశీ (22). పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>