Mobile Popup Ad
Mobile Popup Ad

కవాడిగూడలో ఘోరం: మహిళ దారుణ హత్య!

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ (Kavadiguda)లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కవాడిగూడ ప్రాంతంలోని రత్నదీప్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. బహదూర్‌పురా కిషన్‌బాగ్‌కు చెందిన బంగి దేబోరా అనే మహిళ అక్కడి ఒక స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఉదయం భర్తతో గొడవపడి ఆమె నేరుగా స్పా సెంటర్‌కు వచ్చేసింది.

ఆ తర్వాత భర్త కూడా స్పా సెంటర్‌కు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా పొడిచి ఆమెను అక్కడికక్కడే హతమార్చి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఘాతుకానికి ఒడిగట్టిన భర్త అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also: ట్రెండీ లుక్‌లో ‘పెద్ది’ హీరోయిన్.. జాన్వీ కపూర్ పిక్స్ వైరల్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>