కలం, వెబ్ డెస్క్ : సౌత్ ఇండియా హాట్ ఫేవరెట్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర జంటగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint) సినిమా తెలుగు, కన్నడ టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా విడుదల చేశారు. ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వం వహించారు. వరలక్ష్మి పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో పాటు ఫుల్ ఎంటర్‌టైనింగ్ రోల్‌లో కనిపించనున్నారు. నవీన్ చంద్ర బలమైన పాత్రలో నటించారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. “ప్రేమ, పగ, మంచి-చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా హారర్ థ్రిల్లర్‌తో పాటు అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. కన్నడ స్టార్ రాగిణి ద్వివేది స్పెషల్ రోల్‌లో కనిపిస్తారు” అని చెప్పారు. వరలక్ష్మి మాట్లాడుతూ, “సబ్జెక్టు నచ్చి చేశాను. యాక్షన్‌తో పాటు ఫుల్ కామెడీ ఉంటుంది. అందరికీ నచ్చే సినిమా ” అని అన్నారు. ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం(Police Complaint) తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోంది.
Read Also: వారణాసి సెట్ చూడాలని ఉంది: అవతార్ డైరెక్టర్
Follow Us On: Pinterest


