కలం, వెబ్‌డెస్క్: అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వొద్దని మావోయిస్టు పార్టీ (Maoist party) డిమాండ్ చేసింది. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని మావోయిస్టు పార్టీ (Maoist party) డిమాండ్ చేసింది. అరెస్టులను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంభిస్తోందని.. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. పేదలను దోచుకుంటున్నదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. అటువంటి బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వొద్దని మావోయిస్టు పార్టీ సూచించింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి
దోపిడీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాసిస్ట్ విధానాల అమలు చేస్తూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని మావోయిస్టు పార్టీ విమర్శించింది. ‘తెలంగాణలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నాం. అరెస్ట్ అయినా వారిలో వెంటనే కోర్టులో హాజరు పరచాలని కోరుతున్నాం. ఇటువంటి చర్యలకు అరెస్ట్ అయిన వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలని కోరుతున్నాం. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు వీలుగా అంతా ఉద్యమించాలి. అరెస్టు అయిన వారిని వెంటనే కోర్టులో హాజరు పరచాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యుతంగా ’ అంటూ మావోయిస్టు పార్టీ (Maoist party) లేఖలో డిమాండ్ చేసింది.
మావోయిస్టుల అరెస్ట్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం పంగిడి పంచాయతీకి అనుబంధంగా ఉన్న గూడెం పెద్దదోబకు 3 కిలోమీటర్ల దూరంలోని నిర్జన ప్రాంతంలోని ఓ గుడిసెలో 16 మంది మావోయిస్టులు తలదాచుకున్నారని స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. వెంటనే అప్రమత్తమై రహస్యంగా ఇంటిని చుట్టుముట్టి, ప్రత్యేక పోలీసు బృందం నేతృత్వంలో ఆ మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బృందానికి ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వం వహించారు. ఆ 16 మంది మావోయిస్టుల్లో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, వారిలోని కొంతమంది నిరాయుధులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
Read Also: హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
Follow Us On: Youtube


