Mobile Popup Ad
Mobile Popup Ad

జ‌న‌సేన క‌దిరి ఇంచార్జ్‌పై సొంత‌ భార్య‌, కుమార్తెల‌ ఫిర్యాదు!

క‌లం, వెబ్‌డెస్క్‌: జ‌న‌సేన పార్టీలో నాయ‌కుల వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి. ప‌లువురు జ‌న‌సేన నాయ‌కులు ఇప్ప‌టికే వ‌రుస వివాదాల‌ల్లో చిక్కుకొని ఇబ్బందుల పాల‌య్యారు. తాజాగా మ‌రో నేత కుటుంబ వ్య‌వ‌హారం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. జ‌న‌సేన క‌దిరి (Janasena Kadiri) ఇంచార్జ్ భైర‌వ ప్ర‌సాద్‌ (Bhairava Prasad)పై త‌న సొంత భార్య‌, కూతురు పోలీస్ స్టేష‌న్‌లో పిర్యాదు చేశారు. డ‌బ్బుల కోసం భైర‌వ ప్ర‌సాద్ కుటుంబ‌స‌భ్యుల‌ను వేధిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో భార్య‌, కుమార్తెపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లీకూతుళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వీరిద్ద‌రు ప్ర‌స్తుతం క‌దిరి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. త‌ల్లీకూతుళ్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>