కలం వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో(Sarpanch Elections) ఆదిలాబాద్(Adilabad) జిల్లాలోని ఓ గ్రామం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ గ్రామంలో 69 ఏళ్ల తర్వాత గ్రామ ప్రజలు తొలిసారి ఓటు హక్కుతో సర్పంచ్ ను ఎన్నుకున్నారు.
జిల్లాలోని తలమడుగు(Talamadugu) మండలం బరంపూర్ గ్రామం(Barampur village)లో చివరగా 1956లో ఎన్నికలు జరిగాయి. 69 ఏళ్లుగా సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అవుతోంది. కానీ, తాజా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. దీంతో నేడు తుది విడత ఎన్నికల్లో భాగంగా అధికారులు బరంపూర్‌లో ఎన్నికలు నిర్వహించారు. 69 ఏళ్ల తర్వాత తొలిసారి గ్రామంలోని 2257 ఓటర్లు నేడు ఓటు హక్కు వినియోగించుకొని సర్పంచ్‌ను ఎన్నుకున్నారు. దీంతో ఎవరు గెలుస్తారా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Read Also: బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వొద్దు: మావోయిస్టుల హెచ్చరిక
Follow Us On: X(Twitter)


