కలం, వెబ్‌డెస్క్: నూతన సర్పంచులు, ఉప సర్పంచుల(Panchayat Representatives) బాధ్యతల స్వీకరణను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. డిసెంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆ తేదీని ఇప్పుడు 22వ తేదీకి మార్చారు. డిసెంబర్ 20న సరైన ముహూర్తాలు లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల అభ్యర్థనను పరిశీలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
20న అమావాస్య ఉండటంతో గెలిచిన ప్రజాప్రతినిధుల(Panchayat Representatives) నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు ప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.
మూడో విడత పంచాయతీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల అనంతరం నిర్వహించే ర్యాలీల్లోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Read Also: కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఎన్నికల బహిష్కరణ!
Follow Us On: Pinterest


