కలం వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికలు(Panchayat Elections) కొనసాగుతున్న వేళ ఓ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించి(Boycott Elections) నిరసనకు దిగారు. ఖమ్మం(Khammam) జిల్లా ఏన్కూరు మండలంలోని కొత్త మేడేపల్లి గ్రామంలో ప్రజలు పంచాయతీ ఎన్నికల ఓటింగ్ బహిష్కరించారు.
తమకు కొత్త రేషన్ కార్డులు(Ration cards), ఆధార్ కార్డులు(Aadhaar cards), జనన ధృవీకరణ పత్రాలు(Birth Certificates) ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కూడా లేవని, తమ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం రాజకీయ నాయకులు వస్తున్నారని చెప్పారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని చెప్తూ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
Read Also: పోలింగ్ కేంద్రం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చున్న ఎమ్మెల్యే
Follow Us On: X(Twitter)


