Mobile Popup Ad
Mobile Popup Ad

వారిని తొలగించిన తర్వాతే నీట్ పరీక్ష నిర్వహించాలి: AISF

కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్ర విద్యా శాఖ మంత్రి, NTA చైర్మన్ రాజీనామా చేయాలని, వీరిని ఇలాగే కొనసాగించి మళ్లీ నీట్ (NEET)- యూజీ పరీక్ష నిర్వహించిన పారదర్శకంగా నిర్వహిస్తారన్న నమ్మకం విద్యార్థులకు గానీ, తల్లిదండ్రులకు గానీ లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రాజు అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి గాని, ఏ ఒక్క కేంద్ర మంత్రి గాని నీట్ పరీక్ష రద్దు పై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి కేంద్ర ప్రభుత్వ నియామక ప్రవేశ పరీక్షలలో అక్రమాలను నిరోధించడం కోసం , విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి 2024 ఫిబ్రవరిలో బీజేపీ ప్రభుత్వమే “పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ – 2024” తెచ్చినా ,మళ్లీ లీకేజీల వ్యవహారం ఏమిటని? కేంద్ర ప్రభుత్వాన్ని సి.రాజు ప్రశ్నించారు.

నీట్ (NEET) – యూజీ- 2026 పరీక్ష రద్దైన సందర్భంగా దేశంలో 23 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని , విద్యాశాఖ మంత్రి ,NTA చైర్మన్ రాజీనామా చేసిన తర్వాతనే తదుపరి పరీక్ష తేదీలను ప్రకటించి, 45 రోజులు సమయం ఇవ్వాల్సిందిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు. వీరిని ఇలాగే కొనసాగించి కొత్త తేదీలను ప్రకటించిన, పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తారనే నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రులకు లేదన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పరీక్ష రద్దు కావడంతో విద్యార్థుల భవిష్యత్తు పై ప్రభావం పడుతుందని , వారు మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని అన్నారు. మే 3న జరిగిన నీట్ – యూజీ పరీక్షలో మంచి మార్కులు సాధించిన విద్యార్థి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన పరీక్ష రద్దై మళ్లీ నిర్వహించే పరీక్షలో తక్కువ మార్కులు వస్తే విద్యార్థి మానసిక ఒత్తిడికి గురి అయి ఆత్మహత్యలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంతో మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో, ఒత్తిడి మధ్య రాత్రింబవళ్లు కష్టపడి చదువుకొని పరీక్ష రాస్తే ఈ బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ఆశలన్నీ నీరుగారీ పోయాయన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక నీట్ యూజీ పరీక్ష లీక్ కావడం ఇది రెండవ సారి అని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ సమగ్ర విచారణ జరిపి, దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్, శేఖర్ , నరేష్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: విజయ్‌లా నేనూ అధికారంలోకి వస్తా : కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>