కలం, వెబ్ డెస్క్ : జగన్ మరోసారి వస్తే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). మంగళగిరిలో కొత్తగా సెలెక్ట్ అయిన 5,757 కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 22 నుంచి కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఉంటుందన్నారు. కానిస్టేబుళ్ల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు వెళ్లి 31 కేసులు వేశాయని.. ప్రభుత్వం కొట్లాడి మరీ విజయవంతంగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు చంద్రబాబు.
తాను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తానని.. కానీ వేరే వాళ్లు వస్తే ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తారన్నారు. ‘అన్ని కులాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను ఒకప్పుడు కేటగిరైజేషన్ తీసుకొచ్చా. దాన్ని కోర్టు కొట్టేస్తే మధ్యలో వదిలేశారు. మళ్లీ నేను అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు(Supreme Court)లో తీర్పు వస్తే చట్టం తీసుకొచ్చాం. దాని వల్లే అన్ని వర్గాల వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే’ అంటూ తెలిపారు చంద్రబాబు నాయుడు (Chandrababu).
Read Also: రోడ్డు కావాలన్న కానిస్టేబుల్.. మంజూరు చేసిన పవన్
Follow Us On: X(Twitter)


