epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కోఠి ఉమెన్స్​ కళాశాలలో విద్యార్థినులకు వేధింపులు

కలం, వెబ్​డెస్క్​: కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో (Koti Womens University) పీజీ చదువుతున్న విద్యార్థినులు మంగళవారం ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో తరచూ సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం వల్ల విద్యార్థినుల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కాలేజీ అయిన నేపథ్యంలో బయటి వ్యక్తుల రాకపోకలపై కఠిన నియంత్రణ అవసరమని వారు డిమాండ్ చేశారు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అనవసరంగా జోక్యం చేసుకోవడం, అసభ్యంగా మాట్లాడడం జరుగుతోందని విద్యార్థినులు వాపోయారు.

షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడం పూర్తిగా నిలిపివేయాలని, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కళాశాల ప్రన్సిపాల్​ ఇకపై సెలవు రోజుల్లోనే షూటింగ్‌లకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. కాగా, వేధింపుల ఆరోపణలు రావడంతో మహిళా విశ్వవిద్యాలయం (Koti Womens University)  గర్ల్స్‌ హాస్టల్‌లో మెస్‌ ఇంచార్జీ వినోద్‌ను సస్పెండ్ చేశారు.

Read Also: కొండగట్టు ఆలయానికి అటవీశాఖ నోటీసులు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>