కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల(TDP District Presidents) ను ఖరారు చేసినట్లు సమాచారం. చట్టసభలకు ఎన్నిక కానివాళ్లు, నామినేటెడ్ పోస్టులు దక్కనివాళ్లు ఈ పదవులకు పోటీ పడ్డారు. ఒక్కో జిల్లా నుంచి ఒకటి కంటే ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో పార్టీ త్రీమెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ జిల్లాల్లో పర్యటించి సీనియర్లు, స్థానిక నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు అభిప్రాయం తీసుకొని పార్టీ అధ్యక్షుడికి అందించింది. అనంతరం ఈ జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)కు చేరడంతో ఆయన తుది జాబితాను ఎంపికచేసినట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 13 జిల్లాలకు అధ్యక్షులు ఖరారయ్యారు. ఇందులో తిరుపతి జిల్లాకు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి సారథిగా ఎంపికవగా, అనంతపురం–కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి–ఎంఎస్ రాజు, ప్రకాశం–ఉగ్ర నరసింహారెడ్డి, పల్నాడు–కొమ్మాలపాటి శ్రీధర్, ఏలూరు–బడేటి చంటి, చిత్తూరు–షణ్ముగం, అన్నమయ్య–సుగవాసి ప్రసాద్, నంద్యాల–ధర్మవరపు సుబ్బారెడ్డి, విజయనగరం–కిమిడి నాగార్జున, కాకినాడ–జ్యోతుల నవీన్, బాపట్ల–సలగల రాజశేఖర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు–రేచర్ల వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షులుగా(TDP District Presidents) ఎంపికైనట్లు తెలుస్తోంది.
Read Also: జగన్ కోర్టులను లెక్క చేయడు.. చంద్రబాబు ఫైర్
Follow Us On: X(Twitter)


