epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సత్యవతి రాథోడ్ పై సీతక్క షాకింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పై మంత్రి సీతక్క (Minister Seethakka) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. బీఆర్ ఎస్ నాయకులు కావాలనే మేడారం జాతరపై రకరకాల కథనాలు రాస్తున్నారని.. అవేవీ నిజం కాదన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) ములుగు జిల్లాకు వచ్చి తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు మంత్రి సీతక్క.

ములుగు జిల్లాను తాను మంత్రిగా ఉండి అభివృద్ధి చేయట్లేదని చెప్పడం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని సీతక్క(Minister Seethakka) అన్నారు. ‘సత్యవతి రాథోడ్ కూర్చుంటే లేవలేదు. లేస్తే నిల్చోలేదు. అలాంటి వ్యక్తి కూడా నాపై మాట్లాడుతోంది. వాళ్లు ఎక్కడి నుంచో వచ్చి ములుగుకు ఇన్ చార్జిగా ఉండి ఏ మాత్రం అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. నేను నిత్యం ములుగు జిల్లా కోసమే కష్టపడుతున్నా. నా జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నా’ అంటూ తెలిపారు మంత్రి సీతక్క. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సత్యవతి రాథోడ్ ఫిట్ నెస్ పై సీతక్క కామెంట్ చేయడంతో.. బీఆర్ ఎస్ కేడర్ ట్రోల్స్ చేస్తోంది. ముందు మంత్రి సీతక్క ఫిట్ నెస్ చూసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు బీఆర్ ఎస్ నాయకులు.

Read Also: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>