Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ (Adluri Laxman)కు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించేందుకు మంత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే మంత్రి లిఫ్ట్‌లో ఉండగా లిఫ్ట్ రోప్ తెగిపోయింది. మొదటి అంతస్తు నుంచి లిఫ్ట్ అకస్మాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోయింది. దాదాపు 15 నిమిషాలపాటు మంత్రి లిఫ్ట్ లోనే చిక్కుకుపోవడంతో ఆందోళన నెలకొంది. గమనించిన సిబ్బంది వెంటనే మంత్రిని లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. లిఫ్ట్‌లో ఉన్న మంత్రి లక్ష్మణ్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. స్వల్ప గాయాలు కావడంతో మంత్రికి వైద్యులు చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>