Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ థియేటర్లలో ‘ఆంధ్రావాలా’ సందడి షురూ.. డేట్ ఫిక్స్..!

కలం, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ నటించిన కల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆంధ్రావాలా’ (Andhrawala) మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అయింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మే 20, 2026న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు మూవీని 4K క్వాలిటీలో భారీ స్థాయిలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్రావాలా’. రక్షిత హీరోయిన్‌ గా నటించింది. భారతి సమర్పణలో గిరి నిర్మించిన ఈ సినిమా 2004 జనవరి 1న రిలీజైంది. రిలీజైన టైమ్ లో అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ.. తర్వాత అనేక సార్లు రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ లో ఈ మూవీ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజ్ అవుతున్న ఈ సినిమా మళ్లీ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>