Mobile Popup Ad
Mobile Popup Ad

పూర్తి ధాన్యం కొనుగోళ్ల‌కు ప్ర‌భుత్వం సిద్ధం: నిర్మలా జగ్గారెడ్డి

కలం, మెదక్ బ్యూరో: ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిబద్దతతో ఉందని, రైతులు పండించిన పూర్తి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి (Nirmala Jaggareddy) స్ప‌ష్టం చేశారు. రైతులు ప్రైవేట్ రైస్ మిల్లర్ల వద్ద ధాన్యం అమ్మవద్దని కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్మాలని సూచించారు. కంది మండలం కలివేముల గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధ‌వారం నిర్మ‌లా జ‌గ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చివరి వడ్ల గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులెవరూ అధైర్య పడవద్దని విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>