Mobile Popup Ad
Mobile Popup Ad

రాజీవ్ హైవేపై రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు స్వల్పగాయాలు!

క‌లం, మెద‌క్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా ర‌వాణా శాఖ‌ కార్యాలయం (RTA) లో విధులు నిర్వ‌హిస్తున్న అసిస్టెంట్ మోట‌ర్ వెహికిల్ ఇన్స్‌పెక్ట‌ర్ (AMVI) శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) కి తృటిలో ప్రమాదం తప్పింది. చిన్న‌కోడూరు మండ‌లం శ‌నిగ‌రం రాజీవ్ ర‌హ‌దారిపై వ‌డ్ల‌ లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ధాటికి ట్రాక్టర్ అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లి రోడ్డు ప‌క్క‌న నిలిపి ఉన్న శ్రీకాంత్ రెడ్డికి చెందిన ఇన్నోవా వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి, ట్రాలీలో ఉన్న ధాన్యం బ‌స్తాలు ఇన్నోవా వాహ‌నం పైన ప‌డ్డాయి. అదృష్టవశాత్తు ఘటన జరిగిన సమయంలో వాహనంలో శ్రీకాంత్ రెడ్డి లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ రాముకు స్వల్ప గాయాలు కాగా, ఇన్నోవా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>