Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్‌కు బిగ్ రిలీఫ్.. బల పరీక్షలో నెగ్గిన ప్రభుత్వం

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్‌కు (CM Vijay) భారీ ఉపశమనం లభించింది. అత్యంత కీలకమైన బల పరీక్షలో నెగ్గారు. విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్, ఏఎంఎంకే పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కామరాజ్, డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్‌కాంత్ మద్దతు ఇస్తున్నట్లు ముందే ప్రకటించారు. రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో షణ్ముగం వర్గం 18 మంది సభ్యులు మద్దతు ప్రకటించడంతో సులువుగానే బయటపడింది. అన్నాడీఎంకేలో పళనిస్వామి వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసింది. ప్రతిపక్ష డీఎంకే బల నిరూపణ పరీక్షలో పాల్గొనకుండా వాకౌట్ చేసింది. మెజార్టీ ప్రకారం, 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉండగా.. 26 మంది ఎమ్మెల్యేలు అధికంగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో కీలక ఘట్టం ముగిసింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>