Mobile Popup Ad
Mobile Popup Ad

రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్‌కు యత్నం.. పోలీసుల కాల్పులు

కలం, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో పోలీసుల (Police) కాల్పులు జరిగాయి. పొన్నూరు మండలం ఆలూరు-కొండముడి రైల్వే గేట్‌ సమీపంలో కట్టర్లు పట్టుకుని ట్రాక్‌ వెంబడి అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నట్లు జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. దుండగులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమై వారిపైకి పది రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడి నుంచి పరారు కాగా.. వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

దోపిడీ దొంగల కలకలం..

కొంతకాలంగా రైళ్లలో దోపిడీ దొంగల సంచారం ఎక్కువ అవుతుండటంతో రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది. ప్రయాణికుల రక్షణ నేపథ్యంలో దొంగలను నియంత్రించడానికి కాల్పులు జరపాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, జీఆర్పీ పోలీసులు కొంతకాలంగా పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దుండగులు ఏకంగా రైల్వే ట్రాక్ తొలగించడానికి యత్నించడం కలకలం రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>