Mobile Popup Ad
Mobile Popup Ad

మావోయిస్ట్ పార్టీకి ఎదురు దెబ్బ.. కీలక నేత లొంగుబాటు

కలం, వెబ్ డెస్క్: మావోయిస్ట్ పార్టీకి (Maoist Party) భారీ ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ భార్యతో సహా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట సమీపంలోని సోమిడి గ్రామం. 45 ఏళ్ల కిందటే మావోయిస్ట్ పార్టీకి ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల కాలంలో నిర్బంధం ఎక్కువ అవుతుండటంతో లొంగిపోని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, భార్యతో కలిసి తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. డీజీపీ సీవీ.ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి, లొంగుబాటు వివరాలను వివరించే అవకాశం ఉందని సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>