Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీకాంతచారి తల్లికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను మరింత వేగవంతం చేస్తూ కీలకమైన నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతచారి (Srikanth Chary) తల్లి కాసోజు శంకరమ్మను (Kasoju Shankaramma) నియమించింది. సుదీర్ఘకాలంగా ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్న ఆమెకు సముచిత స్థానం కల్పించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వీరితోపాటు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు కూడా మహిళా కమిషన్ సభ్యురాలిగా అవకాశం దక్కింది. ఉద్యమ కుటుంబాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>