Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడు తాత్కాలిక స్పీకర్‌గా కరుప్పయ్య

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో (Tamil Nadu) ప్రభుత్వం కొలువుదీరిన కాసేపటికే శాసన ప్రక్రియకు కీలక ముందడుగు పడింది. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య నియమితులయ్యారు. సోళవందనం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కరుప్పయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మరికాసేపట్లో నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కరుప్పయ్య తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరించి, సభ్యులతో ప్రమాణం చేయిస్తారు.

రేపు ఉదయం ప్రమాణ స్వీకారం..

నిబంధనల ప్రకారం, ప్రొటెం స్పీకర్‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పూర్తి స్థాయి స్పీకర్ నియమితులయ్యేవరకు ప్రొటెం స్పీకరే సభ నడిపిస్తుంటారు. సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక.. అసెంబ్లీలో బలనిరూపణ జరగబోతుంది. ఈ ప్రక్రియ పూర్తయితే.. ఇక విజయ్ ప్రభుత్వానికి పాలన సాఫీగా సాగేందుకు అడ్డంకులు తొలగినట్లవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>