కలం, వెబ్ డెస్క్ : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో 2.0 (SBI Yono 2.0) ను ఆవిష్కరించింది. యోనో 1.0 లో ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి అప్‌గ్రేడ్ వర్షన్ రూపొందించారు. యోనో ప్రారంభమైన ఎనిమిదేళ్ల తరువాత ఈ కొత్త వర్షన్ ను తీసుకొచ్చిన ఎస్బీఐ.. దీని ద్వారా 50 కోట్లకు పైగా ఖాతాదారులకు డిజిటల్ సేవలు మరింత సులభం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. యోనో 2.0 లో అనేక కొత్త ఫీచర్లను చేర్చింది.
యోనో 2.0 (SBI Yono 2.0 ) లో మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రెండింటికీ ఒకే యూజర్ ఇంటర్ ఫేస్, ఒకే టెక్నాలజీ ఫ్రేమ్ వర్క్ ను అందించారు. దీంతో వినియోగదారులు మొబైల్ నుంచి కంప్యూటర్ కు లేదా ఇతర డివైజలుగా మారినప్పటీకీ ఎలాంటి అంతరాయం ఏర్పడదు. అలాగే, యూపీఐ (UPI) చెల్లింపులు సులభంగా చెయొచ్చు. డొమెస్టిక్ / ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ ఫర్, ఆటోపే ఆప్షన్లను కూడా యోనో 2.0 కలిగి ఉంది. అలాగే, భద్రత, పర్సనలైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్బీఐ (State Bank of India) KYC, రీ-KYC ని సరళీకృతం చేసింది.
వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలు వినియోగించేటప్పుడు ప్రతిసారి వేర్వేరుగా ధృవీకరించాల్సి అవసరం ఉండదు. దీంతో డిజిటల్ ఆన్ బోర్డింగ్ మరింత వేగంగా, సులభంగా మారనున్నది. క్రెడిట్ స్కోర్ (Credit Score) సిమ్యులేటర్ ఉంది. ఈ యాప్ ను మొబైల్ ఫోన్ తో పాటు డెస్క్ టాప్స్, టాబ్లెట్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా యోనో 2.0 లో కొత్త ఫీచర్లను చేర్చారు. యూజర్ల కార్బన్ ఫుట్ ప్రింట్‌ను ట్రాక్ చేయడం, ‘గ్రీన్ స్కోర్’ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. కాగా, ప్రస్తుతం యోనో 2.0 ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా.. దశల వారీగా 15 భాషలకు పెంచనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.
Read Also: వాయు కాలుష్యంపై చర్చించండి.. కాంగ్రెస్ వాయిదా తీర్మానం
Follow Us On: Instagram


