Mobile Popup Ad
Mobile Popup Ad

పాకిస్థాన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ? బ్రాడ్‌కాస్టర్ల భారీ పొరపాటు!

కలం, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్ల మధ్య శుక్రవారం ఢాకాలో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆరంభంలో టీవీ బ్రాడ్‌కాస్టర్లు చేసిన ఒక భారీ పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ఆటగాళ్ల వివరాలను స్క్రీన్‌పై చూపే క్రమంలో పొరపాటున టీమిండియా ప్లేయర్ల పేర్లను ప్రదర్శించారు. మ్యాచ్ మొదలైన కాసేపటికే పాక్ జట్టు వివరాలను గ్రాఫిక్స్ రూపంలో స్క్రీన్‌పై చూపించారు.

అందులో పాకిస్థాన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)  పేరు కనిపించడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఒక్క రోహిత్ మాత్రమే కాదు.. శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్ వంటి భారత ఆటగాళ్ల పేర్లన్నీ పాక్ ప్లేయర్ల జాబితాలో దర్శనమిచ్చాయి. ఈ ఘోర తప్పిదాన్ని గమనించిన అభిమానులు ఆ స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బ్రాడ్‌కాస్టర్లపై జోకులు పేలుస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>