సైబర్ క్రైమ్.. చదువుకున్నవాళ్లకి తెలంగాణ పోలీస్ అలర్ట్

కలం, వెబ్ డెస్క్ : సైబర్ నేరాలు (Cyber Scams) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువగా చదువుకున్నవాళ్లే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోకుండా తెలంగాణ పోలీస్ (Telangana Police) అలర్ట్ చేసింది. ఇన్వేస్ట్ మెంట్స్ మోసాల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్లే మోసపోతున్నారని ట్విట్టర్ వేదికగా హెచ్చరించింది. రిటైర్ట్ ఉద్యోగులు, ఐటీ ఎంప్లాయిస్ ను లక్ష్యంగా చేసుకుని ఫ్రాడ్స్ జరుగుతున్నాయని పేర్కొంది.

ట్రేడింగ్ గురించి బాగా తెలిసిన వాళ్లే టార్గెట్ గా చేసుకుని కేటుగాళ్లు నమ్మిస్తున్నారని చెప్పింది. ఫేమస్ షేర్ల గురించి వివరిస్తూ నమ్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. తక్కువ సమయంలో ఎక్కువగా లాభాలు వస్తాయంటే నమ్మొద్దని తెలంగాణ పోలీసులు సూచించారు. అత్యాశకు వెళ్లి ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని.. మీ అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి అని హెచ్చరించింది.

Read Also : విజ‌య్‌, త్రిష‌ల పెళ్లి చూడాల‌ని ఉంది.. బాలీవుడ్ న‌టి కామెంట్స్‌

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>