కలం, వెబ్‌డెస్క్: భారత్ సహా మరో 25 దేశాల్లో వీసా (New Zealand Visa) సర్వీస్ ఫీజును న్యూజిలాండ్ పెంచింది. వీసా అప్లికేషన్ సెంటర్స్(వీఏసీఎస్)లు ఈ మేరకు అదనపు చార్జీలు వసూలు చేస్తాయి. పెంచిన ధరలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా సర్వీస్ ఫీజును పెంచినట్లు న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. కాగా, వీసా దరఖాస్తు కేంద్రాల్లో అప్లికేషన్‌కు చెల్లించే సొమ్ముకు ఇది అదనం. ఇమ్మిగ్రేషన్‌లో సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసినందువల్ల దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ సూచించింది.
Read Also: గెలిపించకపోతే చనిపోతా : అనిరుధ్ రెడ్డి
Follow Us On: Youtube


