కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. అన్నదాతకు తిప్పలు తప్పిస్తూ ఆన్లైన్లో ఇంటి నుంచే యూరియాను బుకింగ్ (Online Urea Booking) చేసుకునే వెసులుబాటును కల్పించడానికి మొబైల్ యాప్ను తీసుకురావడానికి తీసుకొస్తోంది. అంశంపై జిల్లా వ్వవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswar Rao) ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ నెల 20 నుంచి యాప్ ద్వారా యూరియా బుకింగ్ ప్రక్రియను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రబీ ముందస్తుపై ప్రణాళికపై చర్చించిన మంత్రి.. యూరియా అధిక వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, కో ఆపరేటివ్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తెలిపారు. కాగా, రైతుల సమయం వృతా కాకుండా ఉండేందుకు, కేవలం ఎరువుల పంపిణీ కోసం ఈ కొత్త యాప్ తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ యాప్ లో రైతులు తమ సమీపంలోని డీలర్ తో పాటు జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యత వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు తమకు అవసరమైన యూరియాను బుకింగ్ (Online Urea Booking) చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు వెల్లడించారు.
Read Also: గోల్డ్.. డబుల్: రెండేండ్లలో రెట్టింపైన ధరలు
Follow Us On: Pinterest


