Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు పశ్చిమ బెంగాల్ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ నూతన సీఎం ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొననున్నారు. శనివారం వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ హయాంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లనుండటం గమనార్హం. రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది.దశాబ్దం తరువాత బెంగాల్ లో కమలం వికసించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 207 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది.

కార్యకర్తల నుంచి పార్టీ అధినేతలవరకు ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వంలో కాషాయపార్టీ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీని ఓడించారు. పశ్చిమ బెంగాల్ లో తన రాజకీయ వ్యూహంతో దూసుకుపోతున్న మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బీజేపీ కుప్పకూలేలా చేసింది. మమతా అరాచక పాలన చేసిందని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎలాగైనా మమతా పాలనకు స్వస్తి చెప్పాలని భావించి.. రాజకీయ వ్యూహాలు రచించింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా వెస్ట్ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గట్టి సంకల్పంలో భారీ మిషన్ ను నిర్వహించి గెలుపొందింది. అక్రమ ఓట్లర్ల ఏరివేత, భారీ పోలీస్ బందోబస్తు లాంటి మాస్టర్ ప్లాన్ లతో మమతా సర్కార్ ను పడగొట్టి బీజేపీ అధికారం దక్కించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>