Mobile Popup Ad
Mobile Popup Ad

బరువు తగ్గేందుకు మందులను వాడుతున్నారా? బీ అలర్ట్

కలం, వెబ్ డెస్క్: ఈరోజుల్లో చాలామంది బరువు తగ్గేందుకు (Weight Loss) మందులను వాడుతున్నారు. అయితే ఆ మందుల వాడకంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గించే మందులు కేవలం ఆకలిని తగ్గించడమే కాకుండా, మెదడులోని రివార్డ్ సర్క్యూట్ పనితీరును కూడా మారుస్తున్నాయని లేటెస్ట్ అధ్యయనం వెల్లడించింది. ఈ మందులు మెదడులో (Brain) ఆహారం పట్ల కలిగే ఆనందాన్ని నియంత్రించే భాగాలపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వ్యక్తులు గతంలో ఇష్టపడిన ఆహార పదార్థాలను ఇష్టంగా తినకుండా చేస్తుంది.

ఈ మార్పులు ఆహారపరంగా కోరికలను తగ్గించడంలో సహాయపడినప్పటికీ, సైడ్ ఎఫెక్ట్ వచ్చేలా చేస్తుందంటున్నారు. ముఖ్యంగా మెదడులోని ఇతర నాడీ సంబంధిత వ్యవస్థలపై ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయని అంటున్నారు. అలాగే మిశ్రమ ఫలితాలు కూడా నిపుణులు పేర్కొంటున్నారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కొన్ని మందులు వికారం వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంటే, మరికొన్ని మాత్రం ఎలాంటి అసౌకర్యం లేకుండానే ఆహారంపై కోరికను తగ్గించేలా చేస్తున్నాయట.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>