Mobile Popup Ad
Mobile Popup Ad

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు బోల్తా..

కలం, వెబ్ డెస్క్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ( PVNR Express Highway) పై డివైడర్ ను ఢీ కొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు వస్తున్న కారు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో హైవేపై ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కాగా, అతివేగం కారణంగానే కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>