కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్ట్ చేస్తున్న మూవీ మన శంకర వర ప్రసాద్ గారు. ఈ మూవీ సంక్రాంతి కానుకంగా జనవరి 12న రాబోతోంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. తనపై వస్తున్న క్రింజ్ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యాడు. అనిల్ రావిపూడి తీస్తున్న సినిమాల్లో ఎక్కువగా క్రింజ్ కామెడీనే ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘క్రింజ్ అనే పేరు నాకు ఎప్పుడో వచ్చేసింది. కానీ దాన్ని నేను సీరియస్ గా తీసుకోను. నా సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. క్రింజ్ అనే వాళ్లు 10 శాతమే ఉన్నారు. మిగతా 90 శాతం జనాలకు నా సినిమాలు నచ్చుతున్నాయి. అందుకే కలెక్షన్లు వస్తున్నాయి అంటూ తెలిపాడు అనిల్ రావిపూడి.
తన సినిమాల వల్ల హీరోలు, నిర్మాతలు కూడా సంతోషంగా ఉన్నారని.. కాబట్టి క్రింజ్ అనే వాళ్లను తాను పట్టించుకోను అంటూ తెలిపాడు. ఇలాంటి విషయాలను తాను సీరియస్ గా తీసుకోను అన్నాడు. అనిల్ చిరంజీవితో చేస్తున్న సినిమా కూడా కామెడీ యాంగిల్ లోనే రాబోతోంది. చిరును చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో చూస్తారని అనిల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో చిరు పాత్ర అందరికీ నచ్చతుందని తెలిపాడు అనిల్ (Anil Ravipudi).
Read Also: ఫరాఖాన్ ఫేమస్ రోస్ట్ చికెన్ తిన్న ఉపాసన..
Follow Us On: Pinterest


